ప్రతీ చిన్నారికి పోలియో చుక్క చేయాలి

నవతెలంగాణ – అశ్వారావుపేట
పోలియో నిర్మూలన లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి సూచించారు.ఇప్పటికే గుర్తించిన 5 ఏళ్ళ లోపు చిన్నారులు అందరికి పోలియో చుక్కలు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.  స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పల్స్ పోలియో నమోదుపై శుక్రవారం టాస్క్ ఫోర్స్ బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని స్పష్టం చేశారు.మండల వ్యాప్తంగా 54 పోలియో కేంద్రాల ద్వారా 8,036 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు నమోదుకు సర్వే ద్వారా గుర్తించామని వినాయక పురం,గుమ్మడి వల్లి ప్రభుత్వ వైద్యులు రాందాస్,మధుళిక లకు ఎంపీపీ శ్రీరామ్మూర్తి వివరించారు. ఈ నెల 3 వ తేదీన ప్రారంభమయ్యే కార్యక్రమం మూడు రోజుల్లో, ( పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో తహశీల్దార్ పి.కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో జి.శ్రీనివాసరావు, సీడీ.పీ.వో రోజా రాణి, ప్రొగ్రాం స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు,సర్ప్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Spread the love