ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా…. 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల సమయానికి పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాల పల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్త గూడెం, అశ్వరావు పేట, భద్రాచలం నియోజకవర్గం ఈ జాబితాలో ఉన్నాయి. పోలింగ్ మూసే సమయానికి క్యూలో ఉన్న వారు మాత్రమే ఓటు వేయవచ్చును. నాలుగు గంటలు దాటిందంటే ఎవరిని కూడా ఓటు వేసేందుకు అనుమతించరు.

Spread the love