ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 23.10 శాతం, తెలంగాణలో 24.31 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 23 శాతం ఓటింగ్‌ నమోదైంది.
హైదరాబాద్ పార్లమెంట్ లో 10.70 శాతం, మల్కాజ్ గిరిలో 15.05, సికింద్రాబాద్ లో 15.77,చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదయ్యింది. మహబూబాబాద్ లో 30.66 శాతం, నల్గొండలో 31.21 శాతం, పెద్దపల్లి పార్లమెంట్లో 26.33 శాతం, నిజామాబద్ లో 28.26, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 పోలింగ్ నమోదయ్యింది.

Spread the love