నవతెలంగాణ-హైదరాబాద్ : వాయుకాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో శుక్రవారం నుంచి స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలలు (ఐదో తరగతి వరకు) ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆతిశీ వెల్లడించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇవి కొనసాగుతాయన్నారు.