నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియ శనివారం ఉంటుందని వివరించారు. ఆదివారం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. శనివారం నుంచి ఈనెల మూడో తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు గడువుందని పేర్కొన్నారు. ఈనెల ఏడో తేదీన తుదివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు ష్ట్ర్‌్‌జూర:// ్‌రజూశీశ్రీyషవ్.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.