– ప్రిన్సిపాల్ ఎం.పరమేశ్వర్
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష మే 24న నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త యం.పరమేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 2024 సంవత్సరానికి ప్రవేశాల కోసం మే 24న (శుక్రవారం) పాలీసెట్ పరీక్ష ఉదయం 11.00 గం. నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. వికారాబాద్ ప ట్టణంలోని 03 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ పరీక్షకు వికారాబాద్ జిల్లాకు చెందిన 1,321 అభ్యర్థులు హాజర వుతారని తెలిపారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, కొంపల్లిలో 240 మంది, భృంగి ఇంటర్నేషనల్ స్కూల్, ఎన్నెపల్లిలో 600 మంది, శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాల, వికారాబాద్‌లో481 మంది హాజరు అవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు అందరూ ఉదయం పది గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 11 గంటలు దాటిన తరువాత ఒక్క నిమిషం అల స్యంగా వచ్చిన పరీక్ష రాయడానికి అనుమతించబోమని స్పష్టం చేశా రు. విద్యార్థులు తప్పక తమ వెంట పెన్నులు, పెన్సిలు, ఎరేజర్ తీసు కొని పరీక్షకు నిర్ణిత సమయంలో హాజరు కావాలని ఆయన తెలిపారు.