నవతెలంగాణ- దంతాలపల్లి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8న మండలంలో నిర్వహించనున్న చెరువుల పండుగను విజయవంతం చేయాలని ఎంపీపీ ఉమా మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఐకెపి సిబ్బంది, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 8న నిర్వహించనున్న చెరువుల పండగ ఏర్పాట్లపై దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉమా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా జూన్ 8న నిర్వహించనున్న ఊరురా చెరువుల పండగను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమాన్ని పండగ వాతావరణం లో నిర్వహించాలని, చెరువు పరిసరాలు ఉండేలా చూసుకోవాలని కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మ, బోనాలతో డప్పు చప్పులతో పాల్గొనేలా చూడాలని, ప్రత్యేక అధికారులు ఏఈలు పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమా, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీ ఓ అప్సర్ పాషా, ఐకెపి సిబ్బంది జి రమణమ్మ, డి వెంకన్న, సర్పంచులు అల్లం కృష్ణ, గండి వెంకటనారాయణ గౌడ్, పంచాయితీ కార్యదర్శులు మధు, విజయ్, పాల్గొన్నారు.