– సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఈ.ఉమామహేష్
– చెరువుల సంరక్షణ సమితి నాయకులతో కలిసి నిరసన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చెరువులను కబ్జాలబారి నుంచి కాపాడి మన ప్రాంతాన్ని మరో బెంగళూరు కాకుండా కాపాడుకో వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి, చెరువుల సంరక్షణ సమితి నాయకులు ఈ.ఉమామహేష్ అన్నా రు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అనుకొని ఉన్న పరికిచెరువు ప్రాంతాన్ని ఆదివారం చెరువుల సంరక్షణ సమితి నాయకులు, పలువురుతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి నిరసన చేపట్టారు. బెంగళూరు పట్టణంలో చెరువులను, కుంటలను కబ్జా పూడ్చి అక్రమంగా నిర్మాణాలను చెయ్యడం వల్ల నేడు నీటి కొరతతో బాధపడుతున్న విషయం మన అందరికి తెలిసిందేనని, అలాంటి పరిస్థితులు మన దగ్గర ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తేనే రాబోవు తరాలకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని వ్యాఖ్యానించారు. కుత్బుల్లాపూర్, హైదరా బాద్‌లో విస్తరించి ఉన్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని గుర్తు చేశారు. సీపీఐ కార్యదర్శి ఈ.ఉమామహేష్, సామాజికవేత్త సాయి కుమార్ పంతులలు హాజరై వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి మండలంలో సుమారు 112 ఎకరాల్లో పరికి చెరువు విస్తరించి ఉండేదని కానీ నేడు చెరువును స్థానిక నాయకులు కోర్ట్ ఆర్డర్ పేరిట చెరువులను కబ్జా చేసి ఆమాయకులకు లక్షల్లో అమ్ము కుంటు మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తే మళ్ళీ నేడు అక్కడే నిర్మాణాలను చేసారని,అదే కాకుండా అన్ని వైపులా నుంచి చెరువును పూడ్చుకుంటు వస్తున్నారని, అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ఉన్న చెరువు మొత్తం అదశ్యం అయ్యి చరిత్రలో ”చెరువులెక్కడ అని” చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అధి కారులు కండ్లు తెరిచి చూసి చెరువులను కాపాడాలని కోరారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసు కోకపోతే రాజకీయాలకతీతంగా అందరిని కలుపుకొని పరికిచెరువును కాపాడుకుంటామని, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.హరి నాథ్, వంగాల శ్రీనివాస్, సదానంద్, సహదేవరెడ్డి, వెంకటేష్, ఇమామ్, విక్రమ్, శివ పాల్గొన్నారు.