నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందోనన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ను వీడిన పొంగులేటి ఎన్నో తర్జనభర్జనల తర్వాత చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మొదట పాలేరు టికెట్ ఆశించిన ఆయన.. చివరకు ఖమ్మం టికెట్‌తో సరిపెట్టుకున్నాయి. ఖమ్మంలో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలుపు తథ్యమనే కాన్ఫిడెన్స్‌తో ఉన్న పొంగులేటి ఆ దిశగానే ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు.. కేసీఆర్ నిరంకుశ తత్వాన్ని ఎండగడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు ఆ ప్రయత్నం సఫలమయ్యే క్షణాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.