‘అభయహస్తం’లో పైరవీలకు అవకాశం లేదు: పొన్నం ప్రభాకర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని  మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ‘‘ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోంది. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదు’’ అని పొన్నం స్పష్టం చేశారు.

Spread the love