నవతెలంగాణ – హైదరాబాద్: విజేత సూపర్ మార్కెట్స్, బాలాజీ గ్రాండ్ బజార్, అక్షయ రడ్లు ఇప్పుడు తమ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని ఫోన్‌పేకు చెందిన భారతదేశపు స్టోర్ ఫస్ట్-కామర్స్ యాప్ పిన్‌కోడ్ నేడు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం అనేక రకాలైన కిరాణా సరకులు, తాజా పండ్లు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులను పిన్‌కోడ్ యాప్‌లో తీసుకువస్తుంది. విజేత సూపర్ మార్కెట్స్, బాలాజీ గ్రాండ్ బజార్ అనేవి హైదరాబాద్ లోని తరతరాల దుకాణాలుగా 5000కు పైగా ఉత్పత్తులను అందిస్తున్నాయి. దాంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు, రోజువారీ నిత్యావసరాలకు కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ఉంచాయి. డెయిరీ విభాగంలో అక్షయ కల్ప, ప్రోవిలాక్, ప్రవర్ష లాంటి క్లీన్ లేబుల్ కలిగిన డెయిరీ ఉత్పత్తులకోసం పేరుపొందిన బ్రాండ్లు ఉన్నాయి. ఇక గోదావరి కట్స్ అయితే అత్యున్నత నాణ్యత కలిగిన తాజా మాంసం ఉత్పత్తులను అందిస్తోంది. ఈ భాగస్వామ్యం గురించి పిన్‌కోడ్ CEO వివేక్ లోచబ్ మాట్లాడుతూ, “హైదరాబాద్ లోని స్థానిక దిగ్గజ దుకాణాలు పిన్‌కోడ్ యాప్‌లోకి రావడం మాకెంతో ఉత్సాహంగా ఉంది. ఇది మా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కస్టమర్లు తమ ఇళ్ల నుండే తమ అభిమాన బ్రాండ్లను సులభంగా అందుకునే వీలు కల్పించడంతో పాటు, పిన్‌కోడ్ లాంటి నమ్మకమైన భాగస్వామితో ఈ బ్రాండ్లు తమ డిజిటల్ ఉనికిని కూడా విస్తరించుకుంటున్నాయి. ఈ భాగస్వామ్యం నగరం మొత్తంలోనూ తమ సేవలను విస్తరించుకునేందుకు వాటికి వీలు కల్పిస్తాయి. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, విజేత సూపర్ మార్కెట్స్, బాలాజీ గ్రాండ్ బజార్ నెలనెలా 50% మేర వృద్ధితో పురోగతి సాధిస్తున్నాయి. ఇది పెరుగుతున్న డిమాండ్‌ను సూచించడమే కాక, మా ప్రయత్నం విజయవంతం కావడానికి సంకేతంగా నిలుస్తోంది.” అని అన్నారు.
విజేత సూపర్ మార్కెట్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ జగన్మోేహన్ రావు మాట్లాడుతూ, “మా ఆన్లైన్ ఉనికిని పెంచుకుని, ఎక్కువ మందికి చేరుకోవడం కోసం పిన్‌కోడ్‌తో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం హైదరాబాద్ నలుమూలలకు మా సేవలను విస్తరించడానికి, మా ప్లాట్ఫారంలోకి మరిన్ని దుకాణాలను తీసుకురావడానికి మాకు గొప్ప అవకాశాన్ని కూడా అందిస్తుంది. పిన్‌కోడ్ ద్వారా మా కస్టమర్లు ఇప్పుడు కిరాణా, FMCG, పండ్లు & కూరగాయలు, ఇతర నిత్యావసరాలు.లాంటి ఒక వైవిధ్య భరితమైన శ్రేణితో కూడిన అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులకు యాక్సెస్ కలిగి ఉంటారు. సౌకర్యం, నాణ్యతకు విలువనిచ్చే ఆధునిక వినియోగదారుల ప్రాధాన్యతలకు తగ్గట్టు సేవలను అందించేందుకు ఈ భాగస్వామ్యం మాకు వీలు కల్పిస్తుంది. టెక్నాలజీ, లాజిస్టిక్స్ పరంగా పిన్కోడ్నుండి అందే మద్దతు మా డిజిటల్ ఉనికిని పెంచుకోవడంలో క్రియాశీలకం కానుంది. ఇది మా కస్టమర్లు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించేలా చూస్తుంది.” అని అన్నారు. ప్రోవిలాక్ మిల్క్ స్థాపకులు సిద్ధార్థ్ రన్వాల్ మాట్లాడుతూ “హైదరాబాద్ లో మా ఉనికిని విస్తరించేందుకు పిన్‌కోడ్‌లతో భాగస్వామ్యం పొందడం మాకు ఆనందంగా ఉంది. ఇది మా క్లీన్ లేబుల్ కలిగిన ఫారం టు ఫ్రెష్ డెయిరీ ఉత్పత్తులను మా కస్టమర్లు అందుకునేందుకు వీలు కల్పిస్తుంది. పిన్‌కోడ్ ప్లాట్ ఫారం ప్రీమియం డెయిరీ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ను అందుకోవడంలో మాకు సహాయపడుతుంది. ఇది పోషకాలను అందించడం, వాటిని నిలకడగా కొనసాగించడమనే మా నిబద్ధతకు సహాయకారిగా నిలుస్తుంది” అని అన్నారు.
పిన్‌కోడ్ 2 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. ఈ రోజు వరకు 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తూ, వేగంగా వృద్ధి చెందుతోంది. ఫ్రీ డెలివరీ, సీజనల్ ప్రోత్సాహకాలు, ఆర్డర్ పూర్తి చేయడంలో నమ్మకం పొందడం లాంటి ఆఫర్లను మర్చంట్లకోసం అందిస్తుండడంతో డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లోకి నిరంతరాయంగా రూపాంతరం చెందడానికి మర్చంట్లను అనుమతిస్తోంది. శిక్షణ, ప్రత్యేకంగా కేటాయించిన డాష్ బోర్డులు, రోజువారీ కార్యకలాపాల కోసం ఒక మొబైల్ యాప్ ద్వారా విస్తృతమైన సహకారాన్ని కూడా పిన్‌కోడ్ అందిస్తుండడంతో డిజిటల్ స్టోర్లను తమ మార్గంలో మర్చంట్లు నిర్వహించుకునేలా చేస్తుంది.
పిన్‌కోడ్ పరిచయం
భారతదేశపు స్టోర్ ఫస్ట్ కామర్స్ యాప్‌గా ఫోన్‌పే రూపొందించిన పిన్‌కోడ్ ఇ-కామర్స్ రంగంలో సరికొత్త విప్లవాత్మకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థానిక దుకాణాలు, విక్రేతలను డిజిటల్ షాపింగ్ వృద్ధిలో పిన్‌కోడ్ ముందు నిలబెడుతోంది. పిన్‌కోడ్ ద్వారా, ప్రతి భారతీయ దుకాణాదారుడు, తాముంటున్న ప్రదేశంతో సంబంధం లేకుండా, ఇ-కామర్స్ లోని విస్తృతమైన శక్తి సామర్థ్యాలను వినియోగించుకునేలా శక్తివంతులు కావచ్చు. అది పెద్ద స్థాయిలో వినూత్నతను ముందుకు నడిపించడంతో పాటు వృద్ధికి గతంలో ఎన్నడూ లేనన్ని అవకాశాలను సృష్టిస్తోంది.
విజేత సూపర్ మార్కెట్స్ పరిచయం
జగన్మోహన్ రావు ఆలోచనల్లో నుండి పుట్టిన విజేత సూపర్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని చందా నగర్ లో 1999లో ఏర్పాటు చేసిన తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏళ్ల తరబడిగా ఈ సంస్థ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ, ప్రస్తుతం 5 లక్షల చదురపుటడుగులకు విక్రయ ప్రదేశాన్ని విస్తరించుకుంది. ఇప్పుడు 110కు పైగా దుకాణాలను, 5 లక్షల మంది ప్రత్యేక కస్టమర్లను కలిగి ఉన్న ఈ సంస్థ 8 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగి ఉంది.
ప్రోవిలాక్ మిల్క్ పరిచయం
ప్రోవిలాక్ అనేది కొత్త తరానికి చెందిన ప్రత్యేక డెయిరీ కంపెనీ. ఇది డైరక్ట్ టు కస్టమర్ (D2C) పద్ధతిలో కార్యకలాపాలు సాగిస్తోంది. భారీ డెయిరీ ఫారాలతో భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాలను నేరుగా ప్రధాన కేంద్రాల నుండే తీసుకునేందుకు ఈ సంస్థకు వీలవుతోంది. పాలు పితికిన తర్వాతి దశ నుండి చివరగా కస్టమర్లకు డెలివరీ చేసే వరకు, అంటే నాణ్యత నియంత్రణ, కోల్డ్ స్టోరేజ్ లాజిస్టిక్స్, డెలివరీ ప్రక్రియ వరకు అన్ని స్థాయిల్లోనూ కార్యకలాపాలు సంస్థ పూర్తి పర్యవేక్షణలోనే సాగుతాయి. ఈ విస్తృతమైన విధానం మా కస్టమర్లకు అత్యంత నాణ్యమైన రూపంలో పాలను డెలివరీ చేసేలా చూస్తోంది. ప్రత్యేకించి, ఈ పాలు హార్మోన్లు, యాంటీ బయాటిక్స్, కల్తీ పదార్థాలు లాంటి వేమీ లేకుండా, స్వచ్ఛత, నాణ్యతకు ప్రాధాన్యమిచ్చే రీతిలో ఉంటుంది. పాలు అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది త్వరగా చెడిపోతుంది కాబట్టి ఉష్ణోగ్రత నియంత్రణ కలిగిన వాతావరణంలో దీనిని నిర్వహించడం, నిల్వ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ కస్టమర్లకు అత్యంత నాణ్యమైన రూపంలో పాలను డెలివరీ చేయడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంటోంది. ఎందుకంటే, పాలు ఎంత నాణ్యంగా ఉన్నా, అది ప్రకృతి ప్రసాదించిన రీతిలో అత్యంత స్వచ్ఛమైన రూపంలో కస్టమర్‌కు అందకుంటే, ఉపయోగం ఏముంటుంది?