ప్రముఖ తెలుగు గీత రచయిత గురుచరణ్ కన్నుమూత

 

నవతెలంగాణ హైదరాబాద్:తెలుగు సినీ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆత్రేయ దగ్గర శిష్యరికం చేసిన ఆయన దాదాపు రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’ వంటి సూపర్ హిట్ పాటలకు సాహిత్యం అందించారు.

Spread the love