నవతెలంగాణ- రామారెడ్డి : 34వ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు పోసానిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని సిహెచ్ నేహా ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు కే శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నేహా ను, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్ రెడ్డి ని పాఠశాల ఉపాధ్యాయ బృందం తో పాటు వి డి సి సభ్యులు అభినందించారు. ఈనెల 13 నుండి 15 వరకు హైదరాబాదులోని మౌలాలి హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వి డి సి సభ్యులు పాల్గొన్నారు.