నారా భువనేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ- హైదరాబాద్‌ : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు నాశనం అవ్వడానికి ప్రధాన కారణం నారా భువనేశ్వరియేనని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో సోమవారం పోసాని మీడియాతో మాట్లాడారు. భార్యమాట విని చంద్రబాబు, తల్లి మాట విని లోకేష్‌ నాశనమయ్యారన్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన తర్వాత నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. భర్తలను మించిన రాజకీయ నాయకురాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భర్తలను తిట్టారనే విషయం మర్చిపోయిన భువనేశ్వరి, బ్రాహ్మణిలు వచ్చే ఎన్నికల్లో పవన్‌ మద్దతు కోరారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Spread the love