నవతెలంగాణ -పెద్దవూర
అనుముల ఐసీడీఎస్ పరిధిలోని పెద్దవూర మండలం చల్లకుర్తి సెక్టారు పరిధిలోని తుంగతుర్తి అంగన్వాడీ కేంద్రం లో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్ వైజర్ గౌసియా బేగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిరుధాన్యాల గురించి వాటినుండి అందే పోషణ గురించి గర్భిణీ మహిళలకు, యుక్త వయస్సు మహిళలకు బాలికలకు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడి పరిధిలో గల మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క మహిళలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అంగన్వాడి టీచర్లు రమణ, పద్మ, బాలింతలు, గర్భిణీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.