కందకుర్తి గ్రామంలో పోషణ మాసం వారోత్సవాలు

నవతెలంగాణ:రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని 4 అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాస వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని ఐపిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీ బాలింత మహిళలతో మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తాగించినట్లయితే ఆరోగ్యంగా ఉంటుందని, ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు సేయస్కారమనీ ఆమె అన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రంలోని చేర్పించాలని, అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం జరుపుతుందని వారికి సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు చిన్నారులను పంపకూడదని ఆమె అన్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు రాగి జావా జొన్న జావా తప్పకుండా అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలని, పాలు గుడ్లు బాలామృతం అందరికీ అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గంగ జమున, నజమా సుల్తానా, శారద బాలహంస, ఆయలు, తదితరులు ఉన్నారు.
Spread the love