నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదు మంది తహసిల్దార్లుకు స్థాన చలనం

నవతెలంగాణ – నాగర్ కర్నూలు: జిల్లాలో వివిధ హోదాల్లో పని చేస్తున్న 5 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ పి ఉదయ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెల్దండ మండలం తహశీల్దార్ గా ప్రస్తుతం కలెక్టరేట్ లో సి సెక్షన్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రవి కుమార్ ను నియమించారు. అచ్చంపేట ఆర్డీఓ ఆఫీస్ ఏవో గా పనిచేస్తున్న ఎం కృష్ణను ఊర్కొండ తహసీల్దారుగా నియమించారు. తాడూరు తాహసిల్దార్ గా పనిచేస్తున్న బి కార్తీక్ కుమార్ ను కలెక్టరేట్ సూపరింటెండెంట్ గా , ఊర్కొండ తహసిల్దార్ గా పని చేస్తున్న ఎండి జాకీర్ అలీ ని కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ గా నియమించారు.

Spread the love