– మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్
తెలంగాణ తిరుపతి వెంకన్న సాక్షిగా అబద్ధాలు ఆడిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన రథోత్సవ సన్నాహక సభకు ఎమ్మెల్సీ కల్వకుంట కవితతో కలిసి పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. బాన్సువాడ నియోజకవర్గం ప్రజల కు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏది అడిగితే అది ఇచ్చిన కేసీఆర్ ను మర్చిపోయి పదవి కోసం కెసిఆర్ ను మర్చిపోయారని ఆయన అన్నారు. ఏ సీఎం కూడా రాష్ట్రాన్ని ఇంతలా అభివృద్ధి చేయలేదని, తాను బతికున్నంత కాలం కేసీఆర్ కు అండగా ఉంటానని తిమ్మాపూర్ వెంకటేశ్వర సాక్షిగా అబద్ధాలు ఆడారని ఎద్దేవా చేశారు. బాన్సువాడ నియోజకవర్గం లో వచ్చేది గులాబీ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. వీరి వెంట టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.