సమ్మెతో మూతపడ్డ తపాలా కార్యాలయాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట 
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఒకరోజు సమ్మె అశ్వారావుపేటలో విజయవంతంగా ముగిసింది. అశ్వారావుపేట ఉప తపాలా కార్యాలయంలో పాక్షికంగా, మిగిలిన 17 బ్రాంచి పోస్టాఫీసులన్నీ పూర్తిగా సమ్మె నేపథ్యంలో బుధవారం మూతపడ్డాయి. జీ.డీ.ఎస్ లకు 12,24,36 సీనియర్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పారితోషకాలు ఇస్తూ చేయించే పనిని తపాలా శాఖ పనివిధానంలోకి తీసుకోవాలని డిమాండు చేశారు.జీ.డీ.ఎస్ లకు ఎనిమిది గంటల పని, పింఛను తో సహా అన్ని ప్రయోజనాలు ఇవ్వాలని, గ్రూపు ఇన్సూరెన్స్ గత పీఆర్సీ సూచించిన విధంగా రూ.5 లక్షలు చేయాలని, కమలేష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీ.డీ.ఎస్ సంఘ నాయకులు టి. దుర్వాసరావు, జ్యోతి, ఎండీ ఫైజుద్దిన్, దాసు బాబు, కాకా శ్రీను, రామకృష్ణ, శశాంక్, నవీన్, అనిల్, విఘ్నేష్ పాల్గొన్నారు.
Spread the love