కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్ట్ కార్డ్ ఉద్యమం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ఉపాధ్యాయులు రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ లలో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కోసం వినూత్న కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ పోస్ట్ కార్డు ద్వారా సమస్యల పట్ల సీఎం వెంటనే స్పందిస్తారని తమందరము నేటి వరకు అశిస్తూన్నమని తెలిపారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల తమ సమస్యలను విన్నవించుకోవడంతో పాటు మ కుటుంబాలను సైతం ఆదుకోవాలని పోస్ట్ కార్డు ద్వారా మా సమస్యలను తెలిపామన్నారు. సీఎం వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కారం చేసి కుటుంబాలను కుడా అందుకునే వారౌతరన్నారు.
ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమం 12 యూనివర్సిటీలో నిర్వహించామని, పోస్ట్ కార్డులో మా సమస్యలు వివరించమని పేర్కొన్నారు. దీనికి తెలంగాణ జాక్ చైర్మన్ కన్వీనర్ కరుణాకర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.సమస్యలు పరిష్కారం కాని సందర్భంలో భవిష్యత్తులో వినూత్న కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.అనంతరం తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి మాట్లాడుతూ ఈ పోస్టు కార్డు ద్వారా మా సమస్యలను వెంటనే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్, డాక్టర్ నాగేశ్వర రావు, డాక్టర్ గోపిరాజ్ ,డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ రమ్య, డాక్టర్ జోష్ణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్ రావు, డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ సందీప్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ రామలింగం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ బి.ఆర్ నేత, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ జి శ్రీనివాస్, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్ డాక్టర్ డానియల్, డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఆనంద్ తోపాటు కాంట్రాక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love