మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ మరోసారి హైదరాబాద్ లో పోస్టర్లు..

నవతెలంగాణ-హైదరాబాద్: నేడు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలవడం చేర్చనీయాంశంగా మారింది. ‘తెలంగాణ పుట్టుకను పదేపదే అవమానించిన ప్రధానికి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు’ అంటూ.. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు, కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు.. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు..  తెలంగాణ మీద మోడీది సవతితల్లి ప్రేమ అంటూ పోస్టర్లను అతికించారు. ప్రధాని పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడిన మాటలను అందులో లెక్కించారు. కాగా, నేడు తెలంగాణలోని మహబూబ్ నగర్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.

Spread the love