నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ వచ్చిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ను తెలంగాణ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి కలిశారు. సర్కిల్ పరిధిలో పోస్టల్ సేవల్ని ఆయనకు వివరించారు. ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ‘హర్ ఘర్‌కు తిరంగా’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 6,267 పోస్టాఫీసుల ద్వారా ఇప్పటి వరకు 1.14 లక్షల జాతీయ పతాకాలను అమ్మినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు 6.38 లక్షల జాతీయ పాకాలను సరఫరా చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి జాతీయపతాకాన్ని బహూకరించారు.