విజయ్ ఆంథోనీ కూతురుది ఆత్మహత్యే..పోస్టుమార్టం రిపోర్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఉదయం తమిళ సినిమా పరిశ్రమలో ఒక విషాద వార్త చాలామందిని తీవ్ర దుఃఖానికి లోను చేసింది. హీరో, నిర్మాత మరియు డైరెక్టర్ అయిన విజయ్ ఆంథోనీ కూతురు మీరా (16) ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మీరాకు అనారోగ్య సమస్యతో బాధపడుతూ పూర్తిగా డిఫ్రెషన్ లో ఉందట. ఈ డిఫ్రెషన్ ను భరించలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కాగా లేటెస్ట్ గా మీరా మృతదేహానికి డాక్టర్స్ పోస్ట్ మార్టం ను పూర్తి చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో స్ఫష్టంగా మీరాది ఆత్మహత్యే అంటూ కనబరిచారు. ఇక మీరా మృతదేహానికి అంత్యక్రియలను రేపు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. మరి మీరాకు ఎటువంటి కారణాల వలన డిప్రెషన్ లోకి వెళ్లిందో ? అసలు ఆమె లైఫ్ లో ఏమి అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న పూర్తి వివరాలు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇక విజయ్ ఆంథోనీ దైర్యంగా ఉండాలంటూ మిత్రులు, ఫ్యాన్స్ ఓదార్చుతున్నారు.

Spread the love