సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

నవతెలంగాణ ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ వాయిదా పడింది.

Spread the love