పదవులు శాశ్వతం కాదని రాజకీయాలు మానవీయ కోణంలో ఉంటేనే.. నాయకులు ప్రజల మన్ననలు పొందుతారని కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి అన్నారు. ప్రజా సేవలోనే పరమావధి లభిస్తుందని ఆ భాగ్యం కల్పించిన 3 వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ మూడవ వార్డులో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో మంజూరైన రూ.10 లక్షల (ఎంపీ ల్యాడ్స్ నిధుల)తో సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి ముఖ్య అతథిగా హాజరై కౌన్సిలర్ మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కి కౌన్సిలర్ మల్లారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్, వర్క్ ఇన్ స్పెక్టర్ బీ.ప్రవీణ్ కుమార్, ఆర్పీ లు, మాజీ సర్పంచ్ తిరుపతి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.