దర్శకుడు సాహిత్ మోత్కూరి మూడవ ప్రాజెక్ట్ ‘పొట్టేల్’. యువ చంద్ర కష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ,’సాహిత్‌తో నాలుగేళ్ళుగా పరిచయం. ఈ కథ ఫోన్‌లో చెప్పాడు. ఈ టీజర్ చూస్తున్నపుడు.. ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఇది మన మట్టికథ. మనకి దగ్గరగా ఉండే సినిమా ఇది. స్క్రీన్ ప్లేలోని మ్యాజిక్ ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది. మంచి ఎమోషన్‌తో ఉండే పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఇది. ఇందులో గంగా పాత్ర చేశాను. ఆ పాత్ర మనలో ఒకడిగా ఉంటుంది’ అని హీరో యువ చంద్ర కష్ణ చెప్పారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ,’మీ అందరి స్పందన చూస్తుంటే టీజర్ పెద్ద హిట్ అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా మా టీం అందరికీ పెద్ద ఎనర్జీ ఇచ్చారు. దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా ఉందీ టీజర్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా కెరీర్‌లో ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణరు, సందీప్‌కి థ్యాంక్స్. పొట్టెల్ ఎమోషనల్ రైడ్‌కి తీసుకెళుతుంది. టీజర్ స్నీక్ పీక్ మాత్రమే. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా గర్వంగా ఫీలౌతున్నాం. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు’ అని దర్శకుడు సాహిత్ మోత్కురి చెప్పారు. నిర్మాతలు నిశాంక్, సురేష్ కుమార్ మాట్లాడుతూ,’ఈ సినిమా వెనుక సాహిత్ కషి ఉంది. తను లేకపోతే సినిమా లేదు. యువ చంద్ర కష్ణ, అనన్య నాగళ్ల, అజరు అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం అదరగొట్టారు. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని చెప్పారు.