పొట్లి మహారాజ్‌ దేవాలయ ఆదాయానికి పదహారేండ్లుగా భారీ నష్టం

15 సంవత్సరాలుగా నామమాత్రపు అద్దె చెల్లిస్తున్న కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం
లీజు పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
మున్సిపల్‌, దేవాదాయ శాఖ అనుమతులు లేకుండానే పాఠశాల భవన నిర్మాణాలు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం
నవతెలంగాణ-తాండూరు
దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం పాలకవర్గం అలసత్వం కారణంగా ఆలయ ఆదాయానికి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. తాండూరు పట్టణ కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు పొట్లి మహారాజ్‌ దేవస్థానం ఆలయ ఆదాయానికి నష్టం వాటిల్లుతున్న సంబంధిత శాఖ అధికారులు నోరు మెదపకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పొట్టి మహారాజ్‌ దేవస్థానం ఆలయ ఆస్తులను అనుభవిస్తూ కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం కోట్లు ఘటిస్తున్నారు. సంవత్సరాలుగా నామమాత్రపు అద్దె చెల్లిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల లీజును పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణ కేంద్రంలోని ఎకరా 20 గుంటల భూమిలో పొట్టి మహారాజ్‌ దేవస్థానం ఉంది. అందులో కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యదేచ్చగా కొనసాగిస్తూ ఉన్నారు. మున్సిపల్‌ దేవాదాయ శాఖ అనుమతులు లేకుండానే భవనాలు నిర్మాణం చేశారు. దేవస్థానం భూములు కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల 16 సంవత్సరాలుగా నామ మాత్రపు అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల వాడుకుంటున్న స్థలానికి సుమారు లక్ష 75 వేల రూపాయలు అద్దె చెల్లించాలి కానీ కేవలం 8500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో 16 వేల ఎస్‌ఎఫ్టి స్థలాన్ని కష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల వాడుకుంటుంది. అదేవిధంగా గ్రౌండ్‌ కోసం వాడుకుంటుంది. దేవాలయానికి 40 షాపులు ఉన్నాయి. అందరూ నామమాత్రపు రెట్లు చెల్లిస్తున్నారు. పాఠశాల నిర్వాహకులు దేవస్థానానికి లక్ష నుండి 1,50,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది కానీ నామమాత్రపు అద్దె చెల్లిస్తూన్నారని అధికారులు అంటున్నారు. దేవాలయ స్థలంలో అక్రమంగా పాఠశాలలు నిర్మించి రాజకీయ ఆర్థిక బలంతో దేవాలయ సొత్తును తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ఆస్తులో జరిగిన అక్రమాలపై ఆలయ భజన ఉండాలి అధ్యక్షులు ప్రభాకర్‌ మహారాజ్‌ 2014లో లోకాయుక్తను ఆశ్రయించారు. పొట్టి మహారాజు ఆస్తులను కాపాడాలని కేసు వేశారు. పాఠశాల యాజమాన్యం ఆర్థిక రాజకీయ బలంతో కేసులను నీరుగారుస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి దేవాలయ ఆదాయాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.
దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం అద్దె చెల్లించే విధంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నత అధికారులకు సిఫారసు చేశాం
పొట్లి మహారాజ్‌ దేవాలయం ఆవరణలో నిర్మించిన కష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌ కేవలం నెలకు 8500 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల వాడుకుంటున్న స్థలానికి 1,50,000లకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దుకాణ సముదాయాలు కూడా నామమాత్రపు అద్దెలు చెల్లిస్తున్నారు. 40 దుకాణాలకు 40 వేలు మాత్రమే వస్తుంది. అద్దెలు పెంచే విధంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసాం.
పొట్లి మారాజ్‌ దేవాలయ ఆలయ ఈవో నరేందర్‌

Spread the love