కరెంటు కోతలు.. వినియోగదారుల వెతలు!

Electricity cuts.. Consumers search!– సరఫరాలో లోపమా? అధికారుల నిర్లక్ష్యమా?
– కరెంటు కోతలతో రైతుల పంటలకు పొంచి ఉన్న ముప్పు
నవతెలంగాణ-గార్ల
మండలంలో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది.తరచూ ఏర్పడుతున్న విద్యుత్‌ అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడూ వస్తుందో, ఎంతసేపు ఉంటుందో,ఎప్పుడూ పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.వానా కాలం రాకతో విద్యుత్‌ వినియోగం తగ్గినా కోతలు ఎందుకుంటు న్నాయనేది వినియోగదారులకు కలుగుతున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 24 గంటలు విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుందనే భావన ప్రజలలో వ్యక్తం అవుతుంది.ప్రతి రోజులో ఒక్కొక్క ప్రాంతంలో సుమారుగా పది సార్లు కరెంట్‌ కోతలు తీవ్రంగా ఉంటున్నాయని ప్రజలు, రైతులు వాపోతున్నారు. మండలంలో పోచారం, గార్ల, బయ్యారం మండలం కొత్తపేట సబ్‌ స్టేషనుల ద్వారా మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీల లోని 36998 ప్రజలకు విద్యుత్‌ సరఫరా అవుతుండగా గహా విద్యుత్‌ కనెక్షన్‌ లు,వ్యాపారా సాముదాయాలు,బావుల ద్వారా మొత్తం 15 వేల సర్వీసు లు ఉన్నట్లు విద్యుత్‌ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి.ఒక్కొక్క సారి గంటల తరబడి రాకపోవడంతో ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌(వినియోగదారులు ఫోన్‌ ద్వారా తెలిపే) సమస్యలు తీర్చుతున్నామని విద్యుత్‌ సిబ్బంది చెప్పు తున్నారు.రోజు సమస్య తీర్చు తుంటే కరెంటు ఎందుకు ఎందుకు పోతుందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.పదే పదే గంటల తరబడి కరెంటు కోతలతో వినియోగదారులు,చిరు వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వెలిబుచ్చారు. పదే పదే కరెంటు వస్తూ పోతూ ఉండటం వలన ఇంట్లో ఉన్న గహౌపకరణాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాలీ పోతున్నాయని విద్యుత్‌ వినియోగదారులు వాపోతున్నారు. కరెంటు కోతలు, పదే పదే కరెంటు కటింగ్‌ ల సమస్యలను పరిష్కరించాలని మండలంలోని వివిధ సోషల్‌ మీడియా లో అధికారులు,సిబ్బంది తో తీవ్ర చర్చలు సైతం జరగడం జరిగింది.
అధికారుల నిర్లక్ష్యమా? సరఫరా లోపమా?
కాంగ్రెస్‌ ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని,విద్యుత్‌ సరఫరాలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని ఉన్నతాధికారులు, మంత్రులు పదే పదే పలు ప్రభుత్వ కార్యక్రమ సమావేశాలలో చెప్పుతున్నారు. కానీ మండలంలో విద్యుత్‌ సరఫరా చూస్తే అందుకు భిన్నంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారనే విమర్శకులు వినియోగదారులు, ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశాలలో విద్యుత్‌ అధికారులు పని తీరు పట్ల ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీసినప్పటికీ విద్యుత్‌ అధికారులు పని తీరులో ఆశించిన మార్పులు రాలేదనే వాదన ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటికీ వర్షాలు సంవద్దిగా కురవక పోవటం పట్ల విత్తనాలు వేసిన రైతులు అందోళన చెందుతుంటే, మరోపక్క విద్యుత్‌ సరఫరాలో ఇలాంటి కోతలతో రైతులు పండించే పంటలపై నీలి నీడలు కమ్ము కున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలే వర్షాలు,రాత్రుల సమయంలో దోమల స్వైరవిహరంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులకు,రైతుల పంటలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన కరెంటు లో కోతలు, సాంకేతికత సమస్యలు లేకుండా మరమ్మత్తులు చేపట్టాలని మండల ప్రజలు, వినియోగదారులు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ మహేందర్‌బాబును వివరణ కోరగా… విద్యుత్‌ మరమ్మత్తులు చేపడుతున్న సమయంలో ఎల్‌సీ తీసుకోవడం జరుగుతుందని సిబ్బందితో సహా క్షేత్ర స్దాయిలోకి వెళ్లి మరమ్మత్తులు ఏమైనా సమస్యలు ఉంటే మరమ్మత్తులు చేపడతామని చెప్పారు. తీగలు వదులుగా ఉన్న ప్రాంతాలలో అవసరమైన చోట స్తంభాలు, విద్యుత్‌ తీగలను అమర్చుతామని చెప్పారు.
విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలి : కందునూరి శ్రీనివాస్‌(సీపీఐ(ఎం) మండల కార్యదర్శి)
రానున్న తీవ్ర వర్షా కాలన్ని దష్టి లో ఉంచుకుని సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి.రానున్న తీవ్ర వర్షా కాలాన్ని దష్టిలో ఉంచుకుని విద్యుత్‌ అధి కారులు కోతల సమస్యలు లేకుండా మర మ్మత్తులు చేపట్టి ప్రజలకు, రైతుల కు ఇబ్బందులు లేకుండా అవ సరమైన చోట అదనపు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలి.
విద్యుత్‌ సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం వీడాలి : మాజీ ఎంపీపీ మాలోతు వెంకట్‌ లాల్‌
ప్రభుత్వం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు ప్రక టించిందని అ మేర కు అంత రాయం లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలి. రైతులు ఇప్పటికే పంటలు వేశా రని పంటలు ఎండి పోకుండా ముందస్తు మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు, రైతుల కు ఇబ్బందులు లేకుండా చూడాలి.

Spread the love