నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని వల్ల బోర్డింగ్, చెక్-ఇన్ ప్రక్రియలకు ఇబ్బందులు కలగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు తమ పోస్ట్‌ల్లో టెర్మినల్ 3లో అరగంట నుంచి కరెంట్ లేదని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరెంటు అంతరాయానికి గల కారణాలపై స్పష్టత రాలేదు.