పవర్‌ఫుల్‌ బిగ్‌ బుల్‌

రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ల క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వారి గత బ్లాక్‌బస్టర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్‌ స్టైలిష్‌గా మేకోవర్‌ అయ్యారు. శనివారం మేకర్స్‌ ఒక బిగ్‌ అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆయన పాత్రను బిగ్‌ బుల్‌గా పరిచయం చేస్తూ మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. స్టన్నింగ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో సంజరు దత్‌ వైపు గన్స్‌ గురిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇందులో ఆయన పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు పోస్టర్‌ చెప్పకనే చెప్పింది. రామ్‌, సంజరుదత్‌లను తెరపై కలిసి చూడటం అందరికీ ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం పని చేస్తున్నందుకు తన ఆనందాన్ని పంచుకున్నారు సంజరు దత్‌. ”డైరెక్టర్‌ ఆఫ్‌ ది మాసెస్‌ పూరీ జగన్నాథ్‌, రామ్‌తో కలసి సైన్స్‌ ఫిక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో బిగ్‌ బుల్‌ పాత్ర చేయడం ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. 2024 మార్చి 8న సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

Spread the love