రోడ్డు ప్రమాదంలో పీఆర్ ఏఈకి తీవ్ర గాయాలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండల పి ఆర్ ఏ ఈ గా విధులు నిర్వర్తిస్తున్న పిచ్చయ్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. నాగిరెడ్డి పేటలో విధులు నిర్వర్తించి తిరిగి మెదక్ వెళ్తుండగా హవేలీ ఘన్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. నాగిరెడ్డిపేట నుండి మెదక్ వెళ్తున్న పీఆర్ ఏఈ పిచ్చయ్యకు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన స్థానికులు హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.
Spread the love