బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి

• దుబ్బాకలో ఘనంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు
• ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా -ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక  : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో సోమవారం బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మొదట కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపి ప్రభాకర్ రెడ్డి బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీని తీశారు. దుబ్బాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపి ప్రచార వాహనంలో దుబ్బాక వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, సహకరించిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love