నవతెలంగాణ – హైదరాబాద్: జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.