నవతెలంగాణ – హైదరాడబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేసింది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒక యోధుడు పోరాటానికి కొత్త అర్థం చెప్పాడు. 1940ల నాటి చారిత్రక ఫిక్షన్ కథ. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’ అని ఈ సినిమాపై అప్‌డేట్ ఇచ్చింది. ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.