నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీని అగ్ర నిర్మాత అశ్వనీదత్ వైజయంతీ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితర భారీ తారగణం నటించిన విషయం తెలిసిందే.