ముంబయి : ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ గ్రూపు తన 80వ వార్షికోత్సవం సందర్భంగా తన బ్రాండ్ పేరును పీఎల్ కాపిటల్‌గా మార్చుకుంది. ఈ కొత్త బ్రాండ్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎల్ గ్రూప్ విలువలైన సమగ్రత, విశ్వాసం, ప్రామాణిక స్వదేశీ స్ఫూర్తిని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాలన్నారు. భవిష్యత్తు దిశగా ఇప్పుడు 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మారడంపై దృష్టి పెట్టాలన్నారు.