సైన్స్ ఒలంపియాడ్ లో ప్రగతి హైస్కూల్ ప్రభంజనం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ఒలిపియాడ్ పరీక్షకు 70 మంది హాజరు కాగా 22 మంది గోల్డ్ మెడల్ సాధించారని ప్రిన్సిపల్ Sd.సయ్యద్ వైస్ ప్రిన్సిపల్ షబ్బీర్ శనివారం తెలిపారు. లెవెల్-2 పరీక్షకు 11 మంది ఎంపికయ్యారు. పాఠశాల ఆవరణలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సయ్యద్ మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ విద్యార్థుల తార్కిక శక్తిని,సృజనాత్మకతను సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తెలియపరచటం జరుగుతుందని తెలిపారు. పోటీ పరీక్షలు రాయడం ద్వారా పిల్లల్లో మేధస్సు పెరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ Sd.సయ్యద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love