ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Prajavani applications should be dealt with promptly– ప్రజావాణిలో 178 దరఖాస్తులు స్వీకరణ
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ జిల్లాలో పనిచేసే ప్రతి జిల్లా అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, మీ పరిధిలో ఉండే మండలాల్లో పర్యటించి ఏఏ పనులు జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సిన పనులు, ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు 178 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 178 అర్జీలు రాగా భూ సర్వే, పెన్షన్‌ , ఇతర భూ సమస్యలకు సంబంధించినవి, ఇతర శాఖలకు సంబంధించినవి దరఖాస్తులు వచ్చాయని సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలపై ప్రత్యేక దష్టి సారించి వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఇన్‌చార్జి లోకల్‌ బాడీస్‌ సుధీర్‌, అదనపు కలెక్టర్‌ రెవిన్యూ లింగ్యా నాయక్‌, ట్రైని కలెక్టర్‌ ఉమా హారతి, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love