ప్రకాష్‌గౌడ్‌ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం

– రాజేంద్రనగర్‌లో బీఆర్‌ఎస్‌దే విజయం
– నార్సింగి చైర్‌పర్సన్‌ రేఖాయాదగిరి
నవతెలంగాణ-గండిపేట్‌
రాజేంద్రనగర్‌ గడ్డపై ప్రకాష్‌ గౌడ్‌ ఎమ్మెల్యేగా తిరిగి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందునున్నారని నార్సింగి చైర్‌పర్సన్‌ దార్గుపల్లి రేఖాయాదగిరి తెలిపారు. శనివారం నార్సింగి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని కోరే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తప్పుడు సర్వేలను ప్రజలు, కార్యకర్తలు నమ్మొద్దన్నారు. నేడు కౌటింగ్‌లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం కానుందన్నారు. మూడో సారి సీఎంగా కేసీఆర్‌ కావడం ఖాయమన్నారు. నియోజక వర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రకాష్‌గౌడ్‌ మరోసారి గెలవడం ఖాయమన్నారు. ఆయన ఎమ్మెల్యేగా నాల్గొసారి కావడం ఖాయ మన్నారు. గెలుపొందిన వెంటనే అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. దీంతో పాటు ఇప్పుడు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చిన సర్వేలను నమ్మొద్దన్నారు.

Spread the love