ఎమ్మార్పీఎస్‌ మండల ఇన్‌చార్జిగా ప్రమోద్‌

నవతెలంగాణ-కోరుట్ల
పట్టణంలో ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో కన్వీనర్‌ బలవంతుల సురేష్‌, ఎంఎస్పీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ నిర్మాణంలో పార్టీ మండల ఇన్‌చార్జిగా బంగారి ప్రమోద్‌ను నియమించినట్టు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎస్పి బొనగిరి కిషన్‌, బంగారి లోషన్‌, దినేష్‌, వెంకటేష్‌, గడ్డెగరి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love