దేశానికి రైతే వెన్నుముక అని కాంగ్రెస్ మండలి పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ విజయోత్సవ కార్యక్రమన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, అమరవీరుల స్థూపం వద్ద బాణాసంచాల పేల్చి, ర్యాలీగా రైతు వేదిక వరకు చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబాలకు విడుతలవారీగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని, మొదటి విడతగా లక్ష రూపాయలు ఈరోజు చెల్లించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు పెసరు రమేష్, చాడ వెంకటరెడ్డి, బొడ్డు లేనిన్, యాకోబ్ పాషా,రావుల వెంకట్ రెడ్డి, మొట్టి యామిని సురేష్, ఎర్రబెల్లి శరత్, మాజీ ఎంపీటీసీలు రాజు యాదవ్, వనమాల, అంకం రాజకుమారి, నాయకులు రాజిరెడ్డి, సాంబరాజు, తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, రైతు కోఆర్డినేటర్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.