నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఫోటో ఆల్బమ్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.