ప్రతిక ఫటాఫట్‌

Pratika Phataphat– ఐర్లాండ్‌పై భారత్‌ ఘన విజయం
రాజ్‌కోట్‌ : ఐర్లాండ్‌తో తొలి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుక్రవారం రాజ్‌కోట్‌లో జరిగిన మహిళల తొలి వన్డేలో భారత యువ బ్యాటర్‌ ప్రతిక రావల్‌ (89, 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌తో సత్తా చాటింది. కెప్టెన్‌ స్మృతీ మంధాన (41), తేజల్‌ (53 నాటౌట్‌) సైతం రాణించటంతో 239 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ (241/4) 34.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ అమ్మాయిలు గాబీ లూయిస్‌ (92, 129 బంతుల్లో 15 ఫోర్లు), లీ పాల్‌ (59) రాణించటంతో 50 ఓవర్లలో 238/7 పరుగులు చేసింది. భారత్‌, ఐర్లాండ్‌ మహిళల రెండో వన్డే ఆదివారం జరుగనుంది.

Spread the love