నవతెలంగాణ – రెంజల్
మండలంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా ల వద్ద ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ముస్లిం సోదరుల మత పెద్ద ముక్తి హబీబ్ బెగ్ ఖురాన్ ను అనుసరించి ప్రతి ముస్లిం శాంతియుత వాతావరణంలో తమ పండుగలను జరుపుకోవడమే కాకుండా, మహమ్మద్ ప్రవక్త బోధించిన పేదవారికి తాను సంపాదించిన డబ్బులో కొంత వారికి ఇవ్వాలని ఆయన సూచించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, మత విద్వేషాలను తమ మనసులో రాకుండా చూసుకోవాలన్నారు. మండలంలోని రెంజల్, సాటాపూర్, నీల, పేపర్ మిల్, కందకుర్తి, వీరన్న గుట్ట, తాడు బిలోలి, బోర్గం, ఈద్ గల వద్ద ప్రత్యేక ప్రార్థనలను చేసి ఒకరినొకరు కౌగిలించుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.