జాగ్రత్తలు పాటిస్తే ముందంజ…

తల్లిదండ్రులు పిల్లల హోంవర్క్‌పై శ్రద్ధ పెట్టి దగ్గరుండి చేయించగలిగితే వారు పాఠశాలలో ముందంజలో ఉంటారు. అయితే, హోంవర్క్‌లో సహాయం చేయడం అంటే గంటల కొద్దీ కూర్చోబెట్టడం కాదు, వారు చేస్తున్న వర్క్‌ను సులువుగా, సమర్థవంతంగా చేయడానికి ప్రోత్సాహం అందించాలి. ఇలా చేస్తే అలసిపోకుండా ఉంటారు. ఎక్కువ విశ్రాంతి సమయం ఉంటుంది. ఇందుకోసం తల్లిదండ్రులు పాఠశాలల్లో నిర్వహించే సమావేశాలకు హాజరై, పిల్లల హోంవర్క్‌లో మీ ప్రాధాన్యం ఎంతవరకు ఉండాలనేది తెలుసుకోవాలి. వెలుతురులో కూర్చుని వర్క్‌ పూర్తి చేసేలా శ్రద్ధ తీసుకోవాలి. వర్క్‌ను బట్టి పేపర్లు, పెన్సిల్స్‌, గమ్‌, కత్తెర అందుబాటులో ఉంచాలి. పిల్లల ఇష్టాన్ని బట్టి ఏ సమయంలో హోంవర్క్‌ పూర్తి చేస్తారో వివరం తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు రాత్రి భోజనం తర్వాత చేయడానికి ఇష్టపడతారు. అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలి. ఎక్కువ అసైన్‌మెంట్‌ ఉన్నప్పుడు, వర్క్‌ డివిజన్‌ చేసుకునేందుకు, అది పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలి. వీలైతే ప్రతి గంటకు 15 నిమిషాల విరామం ఇవ్వాలి. టీవీ సౌండ్‌, ఎక్కువ సేపు ఫోన్‌కాల్స్‌, పెద్ద వాల్యూమ్‌తో సంగీతం వంటివి లేకుండా చూడాలి. స్వతహాగా ఆలోచించి తప్పులు సరిచేసుకునేందుకు సహకరించాలి. ఇలా చాలా విషయాలలో పిల్లలకు పూర్తిగా సహకరిస్తే వారు పాఠశాలలో అన్నింటిలో ముందుంటారు.

Spread the love