వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో కెలోతు తండ లో డ్రై డే కార్యక్రమాన్ని కార్యదర్శి సురేష్ అధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది తో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు నీటి కుండిలను , పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకెట్లలో , ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు . ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని , కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలి వీటన్నింటి వలన రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని కార్యదర్శి సురేష్ తెలిపారు.ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు స్వప్న, సరిత, ప్రేమ లత గ్రామ పంచాయతి సిబ్బంది ఉన్నారు.