ఈ సీజన్ వ్యాధి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలను పాటించాలని మండల పంచాయతీ అధికారి పద్మ అన్నారు మండలంలోని కాసియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని గతంలో డెంగ్యూ వచ్చిన వారిల్లలోకి గురువారం వెళ్లి పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటగా కాసియా తండాలో ఇల్లు తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒకరు ఎవరి ఇంటి ముందు వారే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఇండ్లలో చెత్తాచదారం లేకుండా చూసుకోవాలని అన్నారు దీంతోపాటు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. నీటి కులాల వద్ద ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోని వేయాలని ఎక్కడపడితే అక్కడ వేయకూడదు అని అన్నారు. గ్రామంలోని ప్రతిరోజు ట్రాక్టర్ ఉంది నడపాలని రోడ్లలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అనంతరం ఆ తండా అంగన్వాడీ కేంద్రం పద్మ సెంటర్లో ఆ టీచర్ పద్మ పిల్లల బరువులను కొలుస్తున్న దృశ్యాలను చూసి తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చందన అంగన్వాడీ టీచర్ బానోతు పద్మ తో పాటు సిబ్బంది భాస్కర్ పాల్గొన్నారు.