గర్భిణులకు సమతుల ఆహారం అవసరం..

Pregnant women need a balanced diet.– ఘనంగా పోషన మసోత్సవం: పిడి రసూల్ బి 
నవతెలంగాణ – డిచ్ పల్లి
గర్భిణులకు సమతుల ఆహారం అవసరమని, తద్వారా శక్తి, రక్షణ ఉంటుందని, ఇదే కాకుండా పుట్టబోయే బిడ్డకు మంచి పోషకాలు అందుతాయని ఐడి సిఎస్ పిడి రసూల్ బి, తహసిల్దార్ వెంకట్ రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత్ రావు,ఎంపిఓ రాజ్ కాంత్ రావు, ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సుశాంత్ రెడ్డి, మండల ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ పేర్కొన్నారు. మంగళవారం  ఇందల్ వాయి మండలంలోని అమ్సన్ పల్లి గ్రామం లో పోషణ పక్షం పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులకు, తల్లులకు  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ గర్భిణులు విటమిన్ లోపం వల్ల వచ్చే అనర్దాలను అర్ధం చేసుకుని తక్కువ ఖర్చుతో ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలని అన్నారు. ఇదే కాకుండా నారింజ పండ్లను, ఫలాలను, పోషక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. తల్లులకు పిల్లల పౌష్టికారంపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్లు, పాలు లాంటి ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ప్రసవానికి అవసరమయ్యే హిమోగ్లోబిస్ అభివృద్ధి పెంపొందించుకోవాలని తెలిపారు. పుట్టబోయే శిశువుకు, పుట్టిన తర్వాత బాలింతకు, బిడ్డకు తగినంత పౌష్టికారాన్ని అందిస్తేనే పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందల్ వాయి మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అంగన్వాడీ సూపర్ వైజర్లు శోభ,సునిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కార్యదర్శి యశ్వంత్ తోపాటు సెక్టార్ కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love