గర్భిణీలు పౌష్టికాహారము తీసుకోవాలి

Pregnant women should take nutritious food– అంగన్వాడి సీడీపీఓ సుగుణ
నవతెలంగాణ- జమ్మికుంట
గర్భిణీలు పౌష్టికాహారము తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ సిడిపిఓ సుగుణ అన్నారు. బుధవారం మండలంలోని తనుగుల హైస్కూల్ లో వావిలాల సెక్టర్ అంగన్వాడి సూపర్వైజర్ అనురాస్ పద్మ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ లో భాగంగా కిశోర బాలికలకుఎనిమియా పై అవగాహన, గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బాలికలు ,గర్భిణీలు ఎనీ మియా లోపం లేకుండా చూసుకోవాలన్నారు. ఐరన్ కు సంబంధించిన టాబ్లెట్లను వాడాలన్నారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిసి నాగరాజు , బిసి నాగరాజు , హెల్త్ సూపర్వైజర్  మనోహర్ , అంగన్వాడి సూపర్వైజర్ అనురాస్ పద్మ  తదితరులు పాల్గొన్నారు.
Spread the love