నేటి నుంచి ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌

జైపూర్‌ : క్రీడాభిమానుల ముందుకు మరో కొత్త లీగ్‌ వచ్చేసింది. హ్యాండ్‌బాల్‌ క్రీడలో ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. జైపూర్‌లోని సవారు మాన్‌సింగ్‌ ఇండోర్‌స్టేడియం వేదికగా జూన్‌ 8-25 వరకు జరుగనున్న తొలి పీహెచ్‌ఎల్‌ లీగ్‌లో ఆరు జట్లు పోటీపడుతున్నాయి. తెలుగు టాలన్స్‌, రాజస్థాన్‌ పాట్రియట్స్‌, గోల్డెన్‌ ఈగల్స్‌ ఉత్తరప్రదేశ్‌, గార్విట్‌ గుజరాత్‌, మహారాష్ట్ర ఐరన్‌మ్యాన్‌, ఢిల్లీ పాంజెర్స్‌లు ఆరంభ సీజన్‌లో టైటిల్‌ వేటలో బరిలోకి దిగుతున్నాయి. నేడు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌, మహారాష్ట్ర జట్లు తలపడనున్నాయి. తెలుగు టాలన్స్‌ సైతం నేడు గుజరాత్‌తో మ్యాచ్‌లో వేట షురూ చేయనుంది. పిహెచ్‌ఎల్‌ విజేతకు రూ.11 లక్షలు, రన్నరప్‌కు రూ.5 లక్షలు నగదు బహుమతి అందించనున్నారు. బుధవారం జైపూర్‌లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆరు జట్ల కెప్టెన్లు, పిహెచ్‌ఎల్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Spread the love